వాడకం ఇలా ఉంటుందా : ఢిల్లీ మెట్రోలో ఎరోబిక్స్

వాడకం ఇలా ఉంటుందా : ఢిల్లీ మెట్రోలో ఎరోబిక్స్

ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకులు చేసే రచ్చకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.  డ్యాన్స్ వీడియోలు... కొట్టుకున్న వీడియోలు ఇలా అన్నీ  సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.  అందరి మాదిరిగా చేస్తే తనకు గుర్తింపు రాదనుకున్నదేమో .. తెలియదు కాని ఓ మహిళ మెట్రో ట్రైన్ జిమ్ సెంటర్ గా మార్చి వ్యాయామం చేసింది.  ఇప్నుడు ఆ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేందుకు అనుకూలమైన వాతావరణం లేదని చాలామంది విమర్శిస్తున్నారు.  ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న మరో వీడియో నెటిజన్ల  దృష్టిని ఆకర్షించింది. ట్రైన్ లో నిలబడి ప్రయాణం చేసేటప్పుడు పట్టుకునేందుకు   హ్యాండ్‌రైల్స్  ఉంటాయి.  ఈ వీడియోలో ఒక మహిళ రన్నింగ్ మెట్రో ట్రైన్  లో వాటిని పట్టుకొని వ్యాయామం చేస్తున్నట్లు వీడియోలో ఉంది.  ఈ వీడియో Jagjot_K143 అనే యూజర్ ద్వారా ఇన్ స్ట్రాగ్రామ్ లో  క్యాప్షన్, “కాలిస్థెనిక్స్ పబ్లిక్‌గా ఉంది అనే క్యాప్షన్ తో పోస్టు అయింది. ఇప్పటి  ( వార్త రాసే సమయం ) వరకు 31 వేల మంది వీక్షంచారు.  కొంతమంది కామెంట్ కూడా చేశారు.  ఒక వినియోగదారు ఇలా అన్నారు, “ప్రశంసనీయమైనది. అయితే ప్రభుత్వ స్థలాలు మరియు ప్రభుత్వ ఆస్తులు విన్యాసాలు ప్రదర్శించడానికి ఉద్దేశించినవి కావని కామెంట్ చేశారు.  మరొకరు..   “అభి యే అనౌన్స్‌మెంట్ భీ స్టార్ట్ హోనే వాలీ హై మెట్రో మే, యాత్రి జాన్ ఊట్ పతంగ్ హర్కతీన్ కెర్నీ సే బాచెయ్. మార్గం ద్వారా బాగా చేసారు. (ఇప్పుడు ఈ ప్రకటన కూడా మెట్రోలో ప్రారంభం కానుంది, ప్రయాణీకులు డాంబిక చర్యలకు దూరంగా ఉండాలి. బాగా చేసారు). అయితే మెట్రో ట్రైన్ లో రీల్స్‌ను సృష్టించవద్దని మెట్రో అధికారులు పదేపదే హెచ్చరించినప్పటికీ, మెట్రో రైళ్లలో కార్యకలాపాలను ప్రదర్శించే వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.. ఈ వీడియోలు కొంతమందికి  వినోదం కలిగించేలా ఉండగా.. మరికొంతమందికి సమస్యలుగా ఉన్నాయి.