మహిళకు సలాం : అలుపెరగని తల్లులు

మహిళకు సలాం : అలుపెరగని తల్లులు

ఆత్మస్థైర్యం ముందు కష్టాలు ఓ లెక్కా..  ముదిమి వయస్సులో కూడా కుటుంబ భారాన్ని మోస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారీ అమ్మమ్మలు.. ఒక్కొక్కరిది ఓక్కో గాథ.. ఆదిలాబాద్‍ పట్టణానికి చెందిన కుసుం బాయి అనే వృద్ధురాలు 40 సంవత్సరాలకు పైబడి ఆకులను అమ్ముకుంటూ బతుకు జీవిస్తోంది. కుమారుడు తీవ్ర అనారోగ్యం పాలైనా ఎనిమిది పదుల వయస్సులో కుటుంబ బాధ్యతలు మొత్తం మోస్తూ జీవితం వెల్లదీస్తోంది.

అలాగే… భుక్తాపూర్ కు చెందిన పోసాని ఇద్దరు కుమారులు చనిపోయారు. 30 ఏళ్లుగా తట్టలు, బుట్టలు అల్లుతూ పొట్టపోసుకుంటోంది. ఉన్న ఒక్కగానొక్క కూతురుకు అన్నీతానై చూసుకుంటోంది.

ఇక… కమలాపూర్ కు చెందిన గంగవ్వకు ఇద్దరు ఆడబిడ్డలు. 35 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతూ జీవిస్తోంది. వీటి అమ్మకం ద్వారా వచ్చిన ఆధాయంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. అలాగే మతిస్థిమితం లేని కొడుకు కుటుంబాన్ని 75 సంవత్సరాల వయస్సులో పోశిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులను ఆనాథలుగా వదిలేస్తున్న ఈ రోజుల్లో.. ఈ వృద్దులంతా ఈ వయస్సులోనూ కష్ట పడుతూ పిల్లలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ నేటి సమాజానికి ఆదర్శ మహిళలుగా నిలుస్తున్నారు.