యూపీలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లుగా మహిళలు

యూపీలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లుగా మహిళలు

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్​పోర్టు కార్పొరేషన్​లో మహిళలకు ఉద్యోగాలు కల్పించింది. బస్సు డ్రైవర్లు, కండక్టర్లుగా మహిళలను నియమించింది. ఆదివారం అయోధ్యలో ‘మిషన్ మహిళా సారథి’ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 51 కొత్త బస్సులకు జెండా ఊపారు. ఈ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు అందరూ మహిళలనే నియమించారు. ‘‘మహిళలు అన్ని రంగాల్లో రాణించలేరనే అభిప్రాయం తప్పని ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ నిరూపించింది. రాష్ట్రంలోని పోలీస్, ఇతర శాఖల్లో 1.5 లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ లో డ్రైవర్లు, కండక్టర్లుగా నియమించాం” అని ఆదిత్యనాథ్ చెప్పారు.