డబుల్​ ఇల్లు’ రాలేదని..  యాసిడ్ ​బాటిల్​తో ప్రజావాణికి..

డబుల్​ ఇల్లు’ రాలేదని..  యాసిడ్ ​బాటిల్​తో ప్రజావాణికి..


 కామారెడ్డి , వెలుగు : డబుల్​ బెడ్​రూం ఇల్లు రాలేదనే బాధతో ఓ మహిళ సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి యాసిడ్​ బాటిల్​తో వచ్చింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని బాటిల్​ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన షబానా డబుల్ బెడ్​రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. 

కొద్ది రోజుల క్రితం లక్కీ డ్రా తీయగా పేరు రాలేదు. దీంతో తనకు డబుల్​ బెడ్​రూం ఇల్లు ఇప్పించాలని సోమవారం కలెక్టరేట్​లో జరిగిన  ప్రజావాణికి దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చింది. అయితే, వచ్చేప్పుడు కవర్​లో బాత్​రూంలో వాడే యాసిడ్​బాటిల్​తీసుకువచ్చింది. లోపలకు వెళ్లడానికి లైన్​లో నిలబడింది. అప్పుడే ఓ కానిస్టేబుల్​గమనించి ఆమె  కవర్ ఓపెన్​చేసి చూడగా బాత్​రూంలో వాడే యాసిడ్​ బాటిల్​కనిపించింది. దీంతో ఆ బాటిల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ తనకు ఇల్లు లేదని, డబుల్ బెడ్​రూం ఇంటి కోసం అప్లై చేసినా రాలేదన్నారు. ఇల్లు రాకపోతే ఆత్మహత్య చేసుకుందామని యాసిడ్​ బాటిల్​ తెచ్చుకున్నానని చెప్పింది. పోలీసులు ఆమెకు సర్ధి చెప్పి ఇంకోసారి ఇలాంటి పని చేయవద్దని, అప్లికేషన్​పెట్టుకోవాలని లోపలకు పంపించారు. దీంతో  ఆఫీసర్లకు తనకు డబుల్​ ఇల్లు ఇప్పించాలని దరఖాస్తు పెట్టుకుని వెళ్లిపోయింది.