ఫిట్ నెస్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్న లేడీస్

ఫిట్ నెస్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్న లేడీస్

ఫిట్ నెస్. ఇప్పుడు ప్రతీ ఒక్కరి నోటా వినిపిస్తోన్న హెల్దీ టిప్. సిక్స్ ప్యాక్ లంటూ జిమ్ ల చుట్టూ అబ్బాయిలు తిరుగుతుంటే.. మాకేం తక్కువంటూ జీరో సైజ్ ల కోసం క్యూ కడుతున్నారు అమ్మాయిలు. గత రెండేళ్లలో ఇదీ మరీ ఎక్కువైందంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. మగవారి కంటే… ఆడవాళ్లే హెల్త్ అండ్ ఫిట్ నెస్ పై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

నగరవాసులు ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జిమ్, యోగా, ఎరోబిక్స్ లాంటివి చేస్తూ స్లిమ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. యోగా, హిప్-అప్, జాజ్, ఫిట్ నెస్ డ్యాన్స్, జుంబా, ఎరోబిక్స్, ఫౌండ్ లాంటి ఫిట్ డ్యాన్స్ లతో పాటు కిక్ బాక్సింగ్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ని ఇంట్రస్ట్ గా నేర్చుకుంటున్నారు మహిళలు. ఎక్సర్ సైజ్ లతో ఫిట్ గా ఉండటంతో పాటు.. ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు. ఒకప్పుడు బరువుతో బాధపడుతూ.. ఇంట్లో పనిచేయలేకపోయిన తాము.. ఇప్పుడు ఇంట్లో పనితో పాటు ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటున్నామంటున్నారు. డైలీ జిమ్ కెళ్లడంతో ఆత్మ విశ్వాసం కూడా పెరిగిందంటున్నారు.

ఇక జిమ్ లలో ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా లేడీ ట్రైనర్లు అందుబాటులో ఉన్నారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి హైక్లాస్ ఏరియాలతో పాటు.. కోఠి, కూకట్ పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్ లాంటి ఏరియాల్లోనూ మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్ లు, మల్టీ ఫిట్ నెస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి మరీ… లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు జిమ్ నిర్వాహకులు. ఫిట్ నెస్ పై మరింత అవేర్నెస్ కల్పించేందుకు సెలబ్రిటీ ట్రైనర్లు, స్టార్ జుంబా డ్యాన్సర్లతో స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు.

ఇక డైలీ వర్కవుట్స్ చేయడంతో.. ఆడవాళ్లు రెగ్యులర్ గా వచ్చే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చంటున్నారు ఫిట్ నెస్ ట్రైనర్లు. ఇక సరైన డైట్ తీసుకుంటూ వర్కవుట్స్ చేస్తే.. ఒబెసిటీ, థైరాయిడ్, పీసీఓడీ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు.

కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ఫిట్ నెస్ సెంటర్లు.. ఇన్వెస్టర్లకి మంచి లాభాల్ని ఇస్తున్నాయి. పెట్టుబడి చేసిన మొత్తం రెండేళ్లలోపే వస్తుందంటుంటున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే గత రెండేళ్లలో 45టాప్ ఫిట్ నెస్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. అంటే ఫిట్ నెస్ కు జనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో తెలుస్తోంది.