
అబిడ్స్, వెలుగు : ఉద్యోగ విధులు నిర్వహిస్తూ నే ఓ మహిళా కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటింది. గురువారం నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా వద్ద మహిళా కానిస్టేబుల్ శైలజ విధులు నిర్వహిస్తోం ది. ఓ వైపు విధులు నిర్వహిస్తూ నే.. ధర్నాలో పాల్గొ న్న ఓ మహిళ కి చెందిన చిన్నారి పాపను తీసుకొని ఆడిస్తూ .. ఆమెకు సీసాతో పాలు పట్టింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.