కరెంట్​ లైట్స్​ కోసం మహిళా కౌన్సిలర్ ధర్నా 

కరెంట్​ లైట్స్​ కోసం మహిళా కౌన్సిలర్ ధర్నా 

వైరా, వెలుగు: దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా జరుపుతున్న వేళ ఓ మహిళా కౌన్సిలర్ కరెంట్​లైట్స్​కోసం ఆదివారం రాత్రి 7 గంటలకు ధర్నాకు దిగారు. తన వార్డులో లైట్స్​ఏర్పాటు చేయాలని మూడు రోజులుగా మున్సిపల్​ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆమె తెలిపారు. ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే మున్సిపల్​ఆఫీస్ ఎదుటే ధర్నా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పదో వార్డులో నడిబొడ్డున స్థానికులు విరాళాలతో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. అయితే ఇక్కడ రోడ్డుపై కరెంట్​లైట్స్​ఏర్పాటు చేయాలని వారు తమకు విజ్ఞప్తి చేశారని, ఇదే విషయంపై ఆఫీసర్లను కోరామన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న మున్సిపల్​కమిషనర్ పి. వెంకటేశ్వర్లు ఆఫీస్​కు వచ్చి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సోమవారం లైట్లను ఏర్పాటు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు. వెంటనే ఏర్పాటు చేస్తేనే విరమిస్తానని ఆమె స్పష్టం చేశారు. అందుకు ఆఫీసర్లు ఓకే అనడంతో విరమించారు.