
- నిందితుడు హౌస్కీపింగ్ సిబ్బంది
- మతిస్థిమితం లేదన్న పోలీసులు
ముషీరాబాద్, వెలుగు: విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్(ఆంధ్ర మహిళా సభ) హాస్పిటల్లో ఓ పేషెంట్భార్యపై అదే దవాఖానలో పని చేస్తున్న ఓ హౌస్కీపింగ్సిబ్బంది అత్యాచారయత్నం చేశాడు. సీఐ జగదీశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ కు చెందిన వ్యక్తి హైబీపీతో బాధ పడుతూ ఈ నెల 11న దుర్గాబాయి దేశ్ ముఖ్దవాఖానలో చేరాడు. డాక్టర్లు అతన్ని రెండు రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించి, శనివారం జనరల్ వార్డుకు మార్చారు.
బాధితుడి భార్యపై హౌస్ కీపింగ్ సిబ్బంది సీతారాం సోమవారం తెల్లవారుజామున అత్యాచారయత్నం చేశాడు. ఆమె అరవడంతో అప్రమత్తమైన హాస్పిటల్సిబ్బంది, పేషెంట్ల సహాయకులు సీతారాంను పట్టుకొని నల్లకుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. నిందితుడి మానసిక స్థితి బాగాలేదని, అతను ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్తీసుకుంటున్నాడని పేర్కొన్నారు.