దేశంలో మహిళా జడ్జీలు పెరుగుతున్నరు: సీజేఐ డీవై చంద్రచూడ్

దేశంలో మహిళా జడ్జీలు  పెరుగుతున్నరు: సీజేఐ డీవై చంద్రచూడ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళా జడ్జీల సంఖ్య పెరగడం శుభపరిణామమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నా రు. కేసు విచారణకు ముందు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్​లో సీజేఐ మహిళా జడ్జీల సంఖ్య పెరగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము కొన్ని సంతోషకరమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ వెను క వరుసలో(కోర్టులో).. మహారాష్ట్ర నుంచి సివిల్ జడ్జి జూనియర్ విభాగానికి చెందిన 75 మంది జడ్జీలు ఉన్నారు. 

ఈ బ్యాచ్​లో 42 మంది మహిళలు, 33 మంది పురుషులు ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతు న్నది. ఇది సంతోషించాల్సిన విషయం” అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. లంచ్ అవర్​లో జ్యూడిషియల్ ఆఫీసర్లతో పాటు మహిళా జడ్జీలను కలిసే ప్రయత్నం చేస్తాన న్నారు. సుప్రీం కోర్టులో కూడా మహిళా జడ్జీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సీనియర్ అడ్వకేట్లు సీజేఐ కోరారు.