
నల్గొండ జిల్లాలో జరిగిన బ్యాంకు చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నకిరేకల్ కో ఆపరేటివ్ బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు ఇద్దరు కిలాడీ లేడీలు. గోల్డ్ లోన్ కోసం వచ్చిన ఓ కస్టమర్ దగ్గర డబ్బులు ఎత్తుకెళ్లారు కిలాడీ లేడీలు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ కో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒగోడు గ్రామానికి చెందిన మాదా నాగరాజు గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకు వచ్చాడు. లోన్ తీసుకొని అక్కడే ఉన్న నాగరాజు బ్యాగును బ్లేడ్ తో కోసి డబ్బులు ఎత్తుకెళ్లారు కిలేడీలు.
బ్లేడుతో బ్యాగును కోసి.. అందులో ఉన్న డబ్బులు కిందపడటంతో రూ. 2 లక్షల 50 వేలు ఎత్తుకెళ్లారు మహిళలు. బ్యాంకు రద్దీగా ఉన్న సమయంలోనే బ్యాగులోని డబ్బులు ఎత్తుకెళ్ళడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బ్యాంకు నుండి బయటకు వెళ్ళాక బ్యాగులో డబ్బులు లేకపోవడం చూసి అవాక్కడయ్యాడు బాధితుడు.
డబ్బులు చోరీకి గురైన సంగతి తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళల కోసం గాలిస్తున్నారు పోలీసులు.