పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని మహిళ మోర్చా నేతల ఆందోళన

V6 Velugu Posted on Dec 02, 2021

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని కోరుతూ ఆందోళనకు దిగారు జూబ్లీహిల్స్ మహిళ మోర్చా నేతలు. మైత్రివనం సారథి స్టూడియో ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా చేశారు. పెరిగిన ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రో ధరలపై కేంద్రం వ్యాట్ తగ్గించినట్టు... రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. లేక పోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 

Tagged Hyderabad, diesel, petrol, VAT, Women Morcha

Latest Videos

Subscribe Now

More News