
కూకట్ పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు.
మహిళను ఎవరు చంపారు..ఎందుకు చంపారనేది అంతుపట్టడం లేదు. మహిళను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంటుందనేది తెలియాల్సి ఉంది. స్థానికుల ఫిర్యాదుతో అపార్ట్ మెంట్ కు వచ్చిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు.
అయితే వారం క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఘటనపై హత్యకు గల కారణాలు, నిందితుడిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఓ ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా లిఫ్ట్ లో వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చిన పరిశీలించారు.
►ALSO READ | సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్టు దగ్గర తగలబడ్డ కారు