సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్టు దగ్గర తగలబడ్డ కారు

సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్టు దగ్గర తగలబడ్డ  కారు

సికింద్రాబాద్  బొల్లారం చెక్ పోస్టు దగ్గర రాజీవ్ రహదారిపై  కారు తగలబడింది.తూంకుంట నుంచి  సికింద్రాబాద్ వస్తుండగా రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫోర్డ్ ఇకో స్పోర్ట్  కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న కౌకూర్ కు చెందిన యువకుడు అప్రమత్తమై వాహనాన్ని పక్కకు అపి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. 

 స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ఆర్మీ అగ్నిమాపక సిబ్బంది కారులో చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోవడంతో కాసేపు  రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

►ALSO READ | కరెంట్ పనిచేస్తుండగా షాక్..భవనం పైనుంచి పడి ఎలక్ట్రిషియన్ మృతి