సమాజాభి వృద్ధిలో మహిళలది కీలకపాత్ర : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

సమాజాభి వృద్ధిలో మహిళలది కీలకపాత్ర :   ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
  •     ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు :  మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మహిళా వారోత్సవాలను జిల్లా మహిళా సమాఖ్య భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని సవాయి గూడెం గ్రామంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.  

ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్‌‌పర్సన్ మాధవిమహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట :  కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళల కళ్లలో ఆనందం చూడడానికే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. బుధవారం మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. సూర్యాపేటలో 27 వేల మహిళా సంఘాలు ఉండగా, 95 నుంచి 100 మంది ఆర్పీలు పనిచేయడం అక్కడి మహిళల్లో ఉన్న చైతన్యానికి నిదర్శనమని అన్నారు.

పార్టీలకతీతంగా ప్రజాసేవ 

నాగర్‌‌కర్నూల్ టౌన్  : పార్టీలకతీతంగా ప్రజాసేవే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌‌ కార్యాలయంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  మహిళా శక్తి భవనాన్ని జూన్‌‌ 3న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.