అక్కడి ఆలయాల్లో మహిళా పూజారులు

V6 Velugu Posted on Jun 13, 2021

తమిళనాడు : ఆలయాల్లో పూజారులుగా పురుషులు ఉండడం కామన్. అయితే తమిళనాడులో త్వరలోనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మహిళా పూజారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆలయాల్లో పూజారులుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపించే మహిళలకు సంబంధిత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం కొత్త కోర్సును కూడా తీసుకువస్తోంది. దీనిపై రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ.. హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్నప్పుడు మహిళలకూ ఆ అవకాశం ఉంటుందని తెలిపారు. సీఎం ఎంకే స్టాలిన్ అనుమతి తర్వాత మహిళలకు పూజారి శిక్షణ అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 
 

Tagged tamilnadu, TEMPLES, women, priests,

Latest Videos

Subscribe Now

More News