ఆఫర్ అంటే.. అంతరిక్షానికైనా వెళతారు: రూ. 500 కు 5 బ్లౌజుల కోసం.. దిల్షుక్ నగర్లో ఎగబడ్డ మహిళలు..

ఆఫర్ అంటే.. అంతరిక్షానికైనా వెళతారు: రూ. 500 కు 5 బ్లౌజుల కోసం..  దిల్షుక్ నగర్లో ఎగబడ్డ మహిళలు..

ఆఫర్ అని బోర్డు పెడితే చాలు.. అవసరం లేకపోయినా ఎగబడి కొనే జనం చాలామంది ఉంటారు. ముఖ్యంగా మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఫర్ అంటే అవసరం లేకపోయినా కొంటారు మహిళలు. ఈ ఆడాళ్ళ వీక్నెస్ ను క్యాష్ చేసుకునేందుకు రకరకాల ఆఫర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తుంటారు వ్యాపారస్తులు. హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో ఇలాంటి ఘటన జరిగింది.. రూ. 500 కే 5 బ్లౌజులు అంటూ అఫర్ పెట్టడంతో ఎగబడ్డారు మహిళలు.

దిల్ షుక్ నగర్ రాజీవ్ చౌక్ దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన బ్లౌజ్ వరల్డ్ షాపులో రూ. 500 కే 5 బ్లౌజ్ లు అంటూ అఫర్ పెట్టడంతో ఎగబడ్డారు మహిళలు.తక్కువ ధరకే బ్లౌజులు వస్తుండటంతో ఎగబడ్డారు మహిళలు. 

ఆఫర్లో బ్లౌజులు కొనేందుకు వచ్చిన మహిళలతో షాపు కిక్కిరిసిపోయింది.. షాపు బయట కూడా క్యూ లైన్లలో బారులు తీరారు మహిళలు. షాపు ఓపెనింగ్ సందర్బంగా పెట్టిన ఈ ఆఫర్ తో పబ్లిసిటీకి పబ్లిసిటీ.. బిజినెస్ బిజినెస్ జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు షాపు యజమాని.