బతుకమ్మ చీరలు బాగా లేవని, అవి తమకు వద్దంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామంలో నిరసన తెలిపారు. బతుకమ్మ చీరలు 50 రూపాయలు కూడా ఉండవని, ఇంత నాశిరకం చీరలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ గ్రామంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి,నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో సునీతారెడ్డి, మదన్ రెడ్డి ప్రసంగిస్తుండగా మహిళలు నిరసన తెలిపారు. కొందరు మహిళలు బతుకమ్మ చీరలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఎలక్షన్ లలో మా ఊరికి వచ్చినప్పుడు మీ సంగతి చెబుతామని హెచ్చరించారు. సర్పంచ్, ఆఫీసర్లు సర్ది చెప్పినా వినకుండా బతుకమ్మ చీరలు తీసుకోకుండానే వెళ్లిపోయారు.
