హైదరాబాద్ సిటీ, వెలుగు: ధూల్పేటబడా బంగ్లా ప్రాంతంలోని గల్లీలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళలు పింట సింగ్, రచన బాయి, సంజన బాయిని ఎస్టీఎఫ్ టీమ్ అరెస్టు చేసింది. వీరి నుంచి 1.450 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది. మరో మహిళ విజయ బాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో ధూల్‌పేటలోని ఓ ఇంటిపై దాడి చేసి 1.449 కేజీల సరుకును సీజ్ చేశారు.
ఈ కేసులో కమలాబాయి, దివ్య సింగ్‌ను అరెస్టు చేయగా, దుర్గాదేవి, నేహబాయి, సంగీత సాహులు పరారీలో ఉన్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబరు7లో బైక్‌పై డ్రగ్స్ తీసుకొని వెళ్తున్న ముగ్గురిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.15 లక్షల విలువైన 22.33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, మూడు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుధాకర్‌రెడ్డి, నితిన్, ప్రకాశ్ చిత్తూరు జిల్లా పీలేరులో ఉండే సుదర్శన్‌రెడ్డి వద్ద డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.