ప్రస్టేషన్ లేడీస్ : లోకల్ రైల్లో.. చెప్పులతో కొట్టుకున్న వీరనారీలు

ప్రస్టేషన్ లేడీస్ : లోకల్ రైల్లో.. చెప్పులతో కొట్టుకున్న వీరనారీలు

మనుషుల మధ్య గొడవలు జరగటానికి ఈ మధ్య కాలంలో పెద్దగా కారణం ఉండాల్సిన పని లేకుండా పోయింది. కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటున్నారు. గల్లీల్లో ఉండే వాళ్ల దగ్గరి నుంచి బెంజి కార్లలో తిరిగే వాళ్ల వరకు ఎవ్వరూ ఇందుకు అతీతం కాకుండా పోయింది. సమాజంలో ముగ్గురు మగాళ్లు కలిసి ఉన్నా... రెండు శిగలు కలిసి ఉండవు అంటారు .ఇప్పుడు కోల్‌కతా లోకల్‌లో ట్రైన్ లో ఇలాగే జరిగింది. ట్రైన్ రణరంగంలా మారింది. లేడీస్ కోచ్‌లో మహిళలు అరుపులు.. చెప్పులతో కొట్టుకోవడం.. పిడి గుద్దులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

రెండు కత్తులు ఒక చోట ఉండలేవు.. అలాగే రెండు కొప్పులు ఒక చోట అస్సలు ఉండవు అనే సామెతను పెద్దలు ఊరికే అన్నారా.. ఇప్పుడు జరిగే కొన్ని గొడవలను చూస్తే అది నిజమనే అంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆడవాళ్ల గొడవలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అవి ఎంత ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

 తాజాగా కోల్‌కత్తా ట్రైన్‌లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియోలో గుంపులుగా ఉన్న మహిళలు అరుపులు, కేకలు వేసుకుంటూ బీభత్సం చేశారు. చెప్పులు సహా చేతికి దొరికిన వస్తువులతో కొట్టుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు.. ఈ భీకర యుద్ధం ఎప్పుడూ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది..

మెట్రో రైళ్లలో గొడవలు కామనై పోయాయి. అయితే కోల్‌కత్తా లోకల్ ట్రైన్‌లో తాజాగా జరిగిన గొడవ అంతకు మించి అనాలి. ఓ మహిళల గ్రూపు ఒకరినొకరు హింసించుకుంటూ వాదులాడుకున్నారు. ట్విట్టర్ యూజర్ @Ayushihihaha ‘కోల్‌కతా లోకల్’ అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ షాక్‌కి గురి చేసింది. మహిళలు చెప్పులతో..పిడి గుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇతర ప్రయాణికులు వారిని శాంతిపచేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.వారి గొడవకు కారణం తెలియలేదు.. కానీ పబ్లిక్ ప్లేస్‌లో మహిళల గ్రూపు హింసకు పాల్పడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

కొట్టుకుని అలిసిపోయిన మహిళలు వారే యుద్ధాన్ని ముగించారు… కాసేపు రెస్ట్ కోసం గ్యాప్ ఇచ్చినట్లు ఉన్నారు. ఈ వైరల్ వీడియో మాత్రం నెటిజన్లకు  వినోదాన్ని పంచింది. పోస్ట్‌ చూసిన నెటిజన్లు మహిళల ముష్టి యుద్ధంపై భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు… ఇంట్లో అత్తల భాధితులే ఉన్నారు కాబోలు.. ఇలా పగ తీర్చుకున్నారు.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో అయితే హల్ చల్ చేస్తుంది.. మొన్నీమధ్య కూడా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. మీరూ ఈ వీడియోపై ఓ లుక్ వేసుకోండి.

Kolkata local? pic.twitter.com/fZDjsJm93L

— Ayushi (@Ayushihihaha) July 11, 2023