మార్చి 8 నుంచి విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌

మార్చి 8 నుంచి విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐహెచ్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ హాకీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌–2026 క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్యమివ్వనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.

 ఇండియాతో పాటు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌, సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రియా ఈ టోర్నీలో ఆడనున్నాయి. ఇందులో టాప్‌‌‌‌‌‌‌‌–3లో నిలిచిన జట్లు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో మార్చి 8 నుంచి 14 వరకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరగనున్నాయి. తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.