ఖ్వాయ్ హావో గుర్తున్నాడా? అదేనండీ.. గత ఏడాది చైనా ప్రపంచానికి పరిచయం చేసిన మగ రోబో న్యూస్ రీడర్. గుర్తొచ్చాడా? ఇప్పుడీ రోబో న్యూస్ రీడర్ గురించి ఎందుకంటారా ? కారణం ఉంది.. అప్పుడు మగ రోబో న్యూస్ రీడర్ ను తీసుకొస్తే , ఇ ప్పుడు మహిళా రోబో న్యూస్ రీడర్ ను ప్రపంచానికి చూపించింది.అవును, చైనా అధికా రిక న్యూస్ చానెల్ షిన్హువా న్యూస్ ఏజెన్సీలో ఈ ఆడ రోబో న్యూస్ రీడర్ ..చకచకా వార్తలను చదివేయనుంది మరి. దాని పేరు షిన్ షియా వోమెంగ్ . చైనా సెర్చ్ ఇంజన్ షౌగౌ కంపెనీతో ఈ ఏఐ రోబోను తయారు చేయించింది షిన్ హువా.మంగళవారం దానికి అపాయింట్మెంట్ ఇచ్చేశారు. మార్చిలో జరిగే చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశాలనుం చి షియా వోమెంగ్ డ్యూటీకెక్కనుంది. అయినా ఏఐ రిపోర్టర్ లు, జర్నలిస్టుల మీద ఆ దేశం చేస్తున్న ప్రయోగం ఇప్పటిది కాదు లెండి. 2012లోనే దానిపై పని మొదలుపెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. జియాజియా అనే ఆడ రోబో జర్నలిస్టును తయారు చేసిం ది. 2017లో వైర్డ్ అనే సంస్థ కో ఫౌండర్ కెవిన్ కెల్లీని అది ఇంటర్వ్ యూ చేసిం ది. షిన్హువా ఆ ఇంటర్వ్ యూను రికార్ డు చేసింది.
