
దుబాయ్: ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు ప్రిపేర్ అవుతున్న జట్లకు ఐసీసీ అదిరిపోయే వార్త చెప్పింది. ఈ వరల్డ్ కప్ విన్నర్‌కు టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు సోమవారం ప్రకటించింది. కప్ గెలిచిన జట్టుకు దాదాపు రూ.39.55 కోట్లు (4.48 మిలియన్ డాలర్లు) లభిస్తాయి. గత ఎడిషన్‌లో విజేతలకు ఇచ్చిన 11.65 కోట్ల (1.32 మిలియన్ డాలర్లు)తో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెంచింది. 8 జట్లు బరిలో నిలిచిన ఈ టోర్నమెంట్‌కు మొత్తం ప్రైజ్‌మనీని ఐసీసీ 13.88 మిలియన్లు (దాదాపు రూ.122.5 కోట్లు)గా నిర్ణయించింది.
గత టోర్నమెంట్‌తో పోలిస్తే ఇది 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా ఈ మొత్తం 2023 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో అందించిన 10 మిలియన్ డాలర్ల (రూ. 88.26 కోట్లు) ప్రైజ్‌మనీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా మెన్స్, విమెన్స్ క్రికెట్‌లో సమానత్వం సాధించాలన్న ఐసీసీ లక్ష్యం నెరవేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ.19.77 కోట్లు, సెమీ-ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు ఒక్కోదానికి రూ.9.89 కోట్లు అందనున్నాయి. గ్రూప్ దశలో ప్రతి విజయానికి రూ.30.29 లక్షలు లభిస్తాయి. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ ‘ఈ ప్రైజ్‌మనీ పెంపు విమెన్స్ క్రికెట్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది మహిళా క్రికెట్ దీర్ఘకాలిక అభివృద్ధికి మా నిబద్ధతను చూపుతుంది. ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో సమానంగా గౌరవం లభిస్తుందని మా నిర్ణయం తెలియజేస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లు వైజాగ్, గువాహతి, ఇండోర్, నవీ ముంబై, తో పాటు శ్రీలంకలోని కొలంబో వేదికల్లో జరుగుతాయి.