Women’s Cricket World Cup 2025: మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఆ రోజే భారత్, పాక్ మ్యాచ్!

Women’s Cricket World Cup 2025: మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. ఆ రోజే భారత్, పాక్ మ్యాచ్!

ఈ ఏడాది చివర్లో ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ తేదీలు, వేదికలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 16) మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 30న ఆతిథ్య భారత్.. శ్రీలంకతో టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడుతుంది.  బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రోజు అక్టోబర్ 1 న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.

అందరూ ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబో వేదికగా అక్టోబర్ 5 న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. 2022 రన్నరప్ ఇంగ్లాండ్ అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో ఆడనుంది. రౌండ్-రాబిన్ దశ అక్టోబర్ 26 వరకు జరుగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 29,30 తేదీలలో జరగనున్నాయి. నవంబర్ 2న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. రౌండ్-రాబిన్ లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీ ఫైనల్ ఆడతాయి. 

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్‎లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్‎లో నిర్వహించి.. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించారు. 

ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‎కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది. ఈ సారి టోర్నీ భారత్‎లోనే జరుగుతుండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 

2025 మహిళల వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్:
 
మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 1—ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 2—బంగ్లాదేశ్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 3 — ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా — బెంగళూరు — మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 4—ఆస్ట్రేలియా vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 5—భారతదేశం vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
సోమవారం, అక్టోబర్ 6—న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
మంగళవారం, అక్టోబర్ 7—ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్—గువహతి—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 8—ఆస్ట్రేలియా vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 9 — భారత్ vs దక్షిణాఫ్రికా — వైజాగ్ — మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 10—న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 11 — ఇంగ్లాండ్ vs శ్రీలంక — గౌహతి — మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 12—భారత్ vs ఆస్ట్రేలియా—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
సోమవారం, అక్టోబర్ 13—దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
మంగళవారం, అక్టోబర్ 14—న్యూజిలాండ్ vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 15—ఇంగ్లాండ్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 16—ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 17—దక్షిణాఫ్రికా vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 18—న్యూజిలాండ్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 19—భారతదేశం vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
సోమవారం, అక్టోబర్ 20—శ్రీలంక vs బంగ్లాదేశ్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
మంగళవారం, అక్టోబర్ 21—దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 22—ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 23 — భారత్ vs న్యూజిలాండ్ — గౌహతి — మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 24—పాకిస్తాన్ vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 25—ఆస్ట్రేలియా v శ్రీలంక—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 26—ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్—గువహతి—ఉదయం 11
ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 29—సెమీఫైనల్ 1—గువహతి/కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 30—సెమీఫైనల్ 2—బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, 2 నవంబర్—ఫైనల్—కొలంబో/బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు