ఎన్నికల కోడ్కు.. కాలనీ అభివృద్ధికి సంబంధం లేదు.. జూబ్లీహిల్స్లో పనులు కొనసాగుతాయి: మంత్రి వివేక్

ఎన్నికల కోడ్కు.. కాలనీ అభివృద్ధికి సంబంధం లేదు.. జూబ్లీహిల్స్లో పనులు కొనసాగుతాయి: మంత్రి వివేక్

హైదారాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగుతాయని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల కోడ్కు.. కాలనీ అభివృద్ధికి సంబంధం లేదని.. శంకుస్థాపన చేసిన పనులన్నీ నిర్వరామంగా కొనసాగుతాయని అన్నారు. శనివారం (అక్టోబర్ 04)  జూబ్లీహిల్స్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. ఫిలింనగర్ ను సందర్శించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

ఫిల్మ్ నగర్ లో పర్యటించిన మంత్రి వివేక్.. ఎం. జి నగర్ కాలనీలో పీజేఆర్ విగ్రహానికి శాలువా కప్పి నివాళులర్పించారు. జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎం.జి నగర్ లో  కో టి 48 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. 

ఇటీవల వరదల సమయంలో కాలనీలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని చెప్పిన మంత్రి.. కాలనీలో సమస్యల పరిష్కారం కోసం మరిన్ని అభివృద్ధి పనులకు మంజూరు చేయించి  తీసుకొస్తానని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. 

►ALSO READ | హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ఎంత దూరానికి ఎంత పెరుగుతుందంటే..

గత ప్రభుత్వం పెద్దలు ఖజానా కాళీ చేసి పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించి సహాయం అందించే దిశగా అధికారులు పనిచేస్తారని చెప్పారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కాకా వెంకటస్వామి అందించిన సేవలను గుర్తు చేశారు మంత్రి వివేక్. 70 వేల మంది నిరుపేదలకు ఇండ్లు అందించడంలో ముందుండి సహాయం చేశారని చెప్పారు. కాకా స్ఫూర్తి తోనే రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.