హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ఎంత దూరానికి ఎంత పెరుగుతుందంటే..

హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ఎంత దూరానికి ఎంత పెరుగుతుందంటే..

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచుతూ TGSRTC సంస్థ నిర్ణయం తీసుకుంది.  సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ -ఎస్ప్రెస్ బస్సులు అన్నింటిలో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

మొదటి మూడు స్టేజీలకు 5 రూపాయలు, 4వ స్టేజీ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలు  సంస్థ వసూలు చేయనుంది. అదే విధంగా మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీని వసూలు చేయనుంది.

హైదరాబాద్ సిటీ బస్సుల్లో పెంచిన ఈ అదనపు ఛార్జీ సోమవారం(అక్టోబర్ 06) నుంచి అమల్లోకి వస్తాయి.

►ALSO READ | చిన్నారులను బలితీసుకుంటున్న కోల్డ్ రిఫ్ సిరప్.. తమిళనాడులో బ్యాన్.. అదే బాటలో ఇతర రాష్ట్రాలు