కర్ణాటకలోని కార్వార్ సముద్ర తీరంలో ఒక విదేశీ పక్షికి చైనా తయారు చేసిన GPSతో ఉండటం తీవ్ర కలకలం రేపింది. కార్వార్‌లోని తిమ్మక్క తోట సమీపంలో ఒక సముద్రపు పక్షి సీగల్ వీపుపై ఏదో చిన్న పరికరం ఉండటం స్థానికులు చూసారు. దింతో వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ పక్షిని పట్టుకున్నారు.
పక్షికి కట్టి ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశీలించి చూడగా దానిపై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని రాసి ఉంది. ఇది పక్షులు ఎక్కడికి వెళ్తాయి, ఏ మార్గంలో ప్రయాణిస్తాయి అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అమర్చే GPS ట్రాకర్.
సాధారణంగా పక్షులపై పరిశోధన చేయడం కామన్. కానీ ఈ పక్షి దొరికిన ప్రాంతం భారత నావికాదళానికి (నేవీ) చెందిన INS కదంబ అనే అతిపెద్ద యుద్ధ నౌకల కేంద్రానికి చాలా దగ్గరగా ఉంది. అందుకే, ఇది కేవలం పరిశోధనేనా లేక పక్షి ద్వారా మన రహస్యాలను కనిపెట్టే ప్రయత్నమా అనే కోణంలో పోలీసులు, నావికా దళ అధికారులు విచారిస్తున్నారు.
ఈ GPS పరికరం గురించి పూర్తి వివరాలు కోసం అధికారులు చైనాలోని పరిశోధనా సంస్థను సంప్రదిస్తున్నారు. అలాగే ఈ పక్షి మామూలుగానే వలస వచ్చిందా లేక వేరే ఏదైనా కారణం ఉందా అని అధికారులు విచారిస్తున్నారు.
