మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పిల్లలమర్రి సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీ స్టూడెంట్ పత్లావత్ పద్మావతి ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపికైంది. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ దశల్లో స్క్రీనింగ్ పూర్తి చేసుకొని ఢిల్లీలో జరిగే వేడుకలకు ఎంపిక కావడం గర్వకారణం అని తెలిపారు.
యూనివర్సిటీ నుంచి మొదటిసారి పద్మావతి ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఎంపికైందన్నారు. పరేడ్లో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ కె ప్రవీణ, ఎస్ఎన్ అర్జున్ కుమార్ పాల్గొన్నారు.
