చిన్నారులను బలితీసుకుంటున్న కోల్డ్ రిఫ్ సిరప్.. తమిళనాడులో బ్యాన్.. అదే బాటలో ఇతర రాష్ట్రాలు

చిన్నారులను బలితీసుకుంటున్న కోల్డ్ రిఫ్ సిరప్.. తమిళనాడులో బ్యాన్.. అదే బాటలో ఇతర రాష్ట్రాలు
  • రాజస్తాన్, మధ్యప్రదేశ్లో దగ్గు మందు తాగిన చిన్నారుల మృతి
  • ఫార్మా కంపెనీలో రెండు రోజుల పాటు తనిఖీలు
  • శాంపిల్స్ సేకరించిన అధికారులు

చెన్నై: దగ్గు మందు కోల్డ్ రిఫ్ సిరప్ ను తమిళనా డు ప్రభుత్వం నిషేధించింది. అక్టోబరు 1 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో ఈ సిరప్ తాగిన 11 మంది పిల్లలు మృత్యువాత పడ్డారన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

కంచిపురం జిల్లా సమీపంలోని ఫార్మా తయారీ కంపెనీలో రెండు రోజుల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించారు. డైథిలీన్ గ్లైకాల్ అనే కెమికల్ ఉనికిని పరీక్షించేందుకు నమూనాలను ప్రభుత్వ ల్యాబ్ కు పంపనున్నారు. 

►ALSO READ | నిరుద్యోగులకు నెలకు రూ.వెయ్యి.. బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ

తమ వద్ద తయారయ్యే మందులను మధ్యప్రదేశ్, రాజ స్తాన్, పాండిచ్చేరీలకు సప్లై చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శిశు మరణాలతో రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులను సూచించకూడదని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.