
- నిరుద్యోగ భృతి ప్రకటించిన ప్రధాని మోదీ
- బీహార్లో పీఎం పర్యటన
- రూ.62 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
- ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయక భత్యం పునరుద్ధరణ
పాట్నా: బీహార్ లో ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లకు నెలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యువత ఉపాధి పొందే వరకు రెండేళ్ల పాటు ఈ పథకం వారికి ఉపయోగ పడుతుందని చెప్పారు.
బీహార్ లో పర్యటించిన సీఎం.. యువత లక్ష్యంగా పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. బీహార్ ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయక భత్యం పథకాన్ని పునరుద్ధరించారు. ఒకేష నల్ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో జన్
నాయక కర్పూరి థాకూర్ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు. మొత్తం రూ.62 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
►ALSO READ | బీర్ బాటిల్పై 20 శాతం ఆవు ట్యాక్స్.. వైరల్గా మారిన బిల్లు
ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా 10 వేలబటీబలు ఏర్పాటు చేస్తే కేవలం పదేండ్లలో ని ఎన్డీఏ హయాంలో మరో 5 వేలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మనది జ్ఞానం, నైపుణ్యం కలిగిన దేశంగా పేర్కొన్న ప్రధాని.. ఆ రెండూ దేశ అవసరాలకు అనుగుణంగా మారితే అనేక రెట్లు ప్రభావం ఉంటుందన్నారు.