బీర్ బాటిల్పై 20 శాతం ఆవు ట్యాక్స్.. వైరల్గా మారిన బిల్లు

బీర్ బాటిల్పై 20 శాతం ఆవు ట్యాక్స్.. వైరల్గా మారిన బిల్లు

మద్యం ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అతిముఖ్యమైన ఏకైక ఆదాయ వనరుగా మారిపోయింది. ఏ వస్తువుపై లేనంత పన్నులు, సెస్సులు వేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అయితే బీర్ బాటిల్ పై 20 శాతం ఆవు ట్యాక్స్ విధించడం వైరల్ గా మారింది. మందు బాటిల్ పై 20 శాతం కౌ సెస్ విధించడంపై రాజస్థాన్ లో పెద్ద డిబేట్ కు దారితీసింది.

ఓ కస్టమర్ జోధ్ పూర్ పార్క్ ప్లాజాలోని జియోఫ్రే బార్ లో మద్యం సేవించేందుకు సెప్టెంబర్ 30న వెళ్లాడు. తనకు కావాల్సిన మందు బాటిళ్లను తెచ్చుకున్న అతను.. బిల్లును చూసీ షాకయ్యాడు. బీర్ బాటిల్ పై ఆవు సెస్సు పేరున 20 శాతం బిల్లు వేయటంపై షాకయ్యాడు. ఆవులను కాపడటం, ఆవులకు షెల్టర్లు నిర్మించడం అనే పేరుతో ఏకంగా 20 శాతం సెస్సు విధించడంపై విమర్శలు వస్తున్నాయి. 

కస్టమర్ బిల్లును ఆన్ లైన్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. జోధ్ పూర్ పార్క్ ప్లాజా  దగ్గర ఉన్న లిక్కర్ షాపులో.. వెలుగు చూసింది ఈ ఘటన. ఆరు బీర్లు, కార్న్ ఫ్రిట్టర్స్ (మక్క గారెలు) తీసుకోగా.. అయిన ఖర్చు 2 వేల 650 రూపాయలు. జీఎస్టీ, వ్యాట్, 20 శాతం ఆవు సెస్సు తర్వాత అది కాస్త 3 వేల 262 రూపాయలకు చేరుకుంది. 

►ALSO READ | 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లయిందని ఆస్పత్రిలో స్వీట్లు పంచిన నిందితుడు.. కట్ చేస్తే..

ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్శం కురిపిస్తున్నారు.  ఇప్పటికే స్టేట్, సెంట్రల్ జీఎస్టీల పేరున జేబులు ఖాళీ చేస్తున్నారని.. ఇప్పుడు ఆవు ట్యాక్స్ అంటూ ఏకంగా 20 శాతం అదనంగా వసూలు చేయడమేంటని మండిపడుతున్నారు. 

దీంతో ఈ బిల్లు 2018నే ఇంట్రడ్యూస్ అయ్యిందని. .అప్పటి నుంచి సెస్సు పడుతూనే ఉందని తెలిపారు. 2018 నుంచి ఆవుల రక్షణ కోసం ఈ సెస్సును కలెక్టు చేస్తున్నట్లు హోటల్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ తెలిపాడు. 

కౌ సెస్ రూపంలో సామాన్యుల జేబులు ఖాళీ చేస్తున్నారని నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు. ఈ న్యూస్ వైరల్ కావడంతో రాజస్థాన్ ఫైనాన్స్ సెక్రటరీ కుమార్ పాల్ గౌతమ్ స్పందించారు. ఈ ఆవు సెస్సును అన్ని రకాల లిక్కర్ పై VAT గా ఉంటుందని  ఆయన తెలిపారు. 22 జూన్ 2018 సమయంలోనే అప్పటి సీఎం వసుంధర రాజే 20 శాతం సెస్సు కోసం సర్ చార్జీ ప్రతిపాదించారని తెలిపారు. దేశీ మద్యం తో పాటు విదేశీ మద్యం పైన కూడా ఈ ట్యాక్స్ ఉన్నట్లు చెప్పారు.