14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లయిందని ఆస్పత్రిలో స్వీట్లు పంచిన నిందితుడు.. కట్ చేస్తే..

14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లయిందని ఆస్పత్రిలో స్వీట్లు పంచిన నిందితుడు.. కట్ చేస్తే..

అత్యాచారం చేసిన నిందితులు ఏదో ఒక సందర్భంలో పశ్చాతాపానికి గురవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక నిందితుడు తప్పు చేశాననే భావన లేకుండా ప్రవర్తించిన తీరు చూసి చుట్టూ ఉన్న వాళ్లు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. పాపం 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి.. ఆమె డెలివరీ అయ్యిందని స్వీట్లు పంచి రాక్షసానందం పొందటం అందరినీ షాకింగ్ కు గురి చేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో జరిగింది. శనివారం (అక్టోబర్ 04) ఉదయం 5 గంటలకు తన కూతురు కడుపునొప్పితో బాధ పడుతోందని ఒక మహిళ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. పరీక్షల తర్వాత ఆ బాలిక ప్రగ్నెంట్ అని తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు డాక్టర్లు. ఆ తర్వాత నార్మల్ డెలివరీలో పాపకు జన్మనిచ్చింది ఆ బాలిక.

అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బాలిక డెలివరీ అయ్యిందని ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ స్వీట్లు పంచాడు అత్యాచార నిందితుడు. అల్మోరా జిల్లా శీతలాఖేట్ కు చెందిన సూరజ్ బీడీ పాండే అనే నిందితుడు అక్కడున్న వాళ్లకు స్వీట్లు పంచాడు. అదేదో పెళ్లి చేసుకున్న తన భార్య డెలివరీ అయినట్లుగా బిల్డప్ ఇవ్వడం అక్కడున్న వారికి చికాకు తెప్పించింది. 

Also Read : ఆరేళ్ల ప్రేమ.. పెళ్లయి జస్ట్ వారం.. మటన్, చికెన్ లొల్లి

రేప్ చేసి బాలిక జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా.. దుర్మార్గుడు స్వీట్లు పంచుతున్నాడని డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడున్నవాళ్లు.  పోలీసులు వెంటనే ఆస్పత్రి దగ్గరకు వచ్చి నిందితుడి కోసం చూస్తుండగా.. విషయం తెలుసుకున్న నిందితుడు సూరజ్.. స్వీట్ బాక్స్ పడేసి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఫేస్ బుక్ పరిచయం.. ఆపై అత్యాచారం

మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమె తల్లి అయినందుకు సంబరాలు చేసుకోవడానికి నిందితుడు స్వీట్లు పంపిణీ చేసిన ఈ కేసు వార్తల్లో నిలిచింది. అల్మోరా జిల్లాలోని శీతలఖేత్ నివాసి సూరజ్.. మూడేళ్ల క్రితం పని వెతుక్కుంటూ నైనిటాల్‌కు వచ్చాడు. ఒక రెస్టారెంట్‌లో పనికి కుదిరాడు. రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు.

 మాయ మాటలు చెప్పి.. ప్రేమ పేరుతో ఆ బాలికను ఆకర్షించాడు. ఆ తర్వాత ఆ బాలికను లైంగికంగా లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భవతి అయింది. ఆస్పత్రిలో ఆ బాలికకు ఆడపిల్ల పుట్టిందని తెలిసి.. అక్కడికి చేరుకుని స్వీట్లు పంచాడు ఈ దుర్మార్గుడు.