శివ్వంపేట, వెలుగు: మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ఎమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి స్వగ్రామమైన శివ్వంపేట మండలం గోమారంలో కాంగ్రెస్బలపర్చిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపొందారు.
కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి హైమావతికి 1,115 ఓట్లు రాగా బీఆర్ఎస్ బలపర్చినఅభ్యర్థి జయమ్మకు 614 ఓట్లు, కాంగ్రెస్రెబల్అభ్యర్థి స్వప్నకు 586 ఓట్లు వచ్చాయి. హైమావతి సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్మద్దతుదారు జయమ్మపై 482 ఓట్ల మెజార్టీతో గోమారం సర్పంచ్‌గా గెలుపొందారు.
