- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
దమ్మపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గ్రామస్థాయి ఓటర్లు నమ్ముతున్నందునే ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులతో బుధవారం మండలంలోని గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారింది. సర్పంచ్, ఉపసర్పంచ్ అభ్యర్థులకు శాలువాలను కప్పి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఊట్లపల్లి సర్పంచ్ సత్యం లక్ష్మీ కుమారి, ఉప సర్పంచ్ సాదు జోషిలను ప్రత్యేకంగా అభినందించారు.
ఊహించని విజయం సాధించారని గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుఖవల్లి వీరభద్రరావు, అశ్వారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మ రాంబాబు, సత్యం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
