హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కు బ్రిటానికా అవార్డు

హార్వెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కు బ్రిటానికా అవార్డు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈ విద్యా సంవత్సరానికి గాను బ్రిటానికా ఎడ్యుకేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ది లీడర్స్ కట్ అవార్డుకు హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఆర్.పార్వతి రెడ్డి ఎంపికై పూణే లో నిర్వహించిన ఫంక్షన్ లో  ఈ అవార్డు అందుకున్నట్లు విద్యాసంస్థల యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

 బ్రిటానికా ఎడ్యుకేషన్ ప్రాజెక్ర్ బెస్ట్ లెర్నింగ్ లో భాగంగా ప్రాజెక్ట్ లను తీసుకున్నారని,  దేశ వ్యాప్తంగా అనేక పాఠశాలల నుంచి 500 ప్రాజెక్టులు తీసుకోగా, అందులో 18 ప్రాజెక్ట్ లు ఎంపిక చేశారని పేర్కొన్నారు. హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ నుంచి నైన్త్ క్లాస్ కు చెందిన ఐదుగురు స్టూడెంట్స్ తయారు చేసిన మెంటల్ హెల్త్ ఆవేర్నెస్​ క్యాంపెయిన్  ఫైనల్ కు ఎంపికైనట్లు తెలిపారు.  బ్రిటానికా అవార్డును సాధించిన పార్వతి రెడ్డిని, స్టూడెంట్స్ కు హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్ అభినందనలు తెలియజేశారు.