లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు..బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడి

లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు..బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడి

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయినట్టు బస్తర్​ఐజీ సుందర్​రాజ్ శుక్రవారం తెలిపారు. వారి వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్, ఇన్సాస్​, 303, 315 బోరు తుపాకులను అప్పగించినట్టు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు జిల్లాలోని గొల్లపల్లి, కిష్టారం, కుంట ఏరియాలకు చెందినవారని తెలిపారు. 

ఏరియా కమిటీ మెంబర్​ సోడి జోగాపై రూ.5లక్షల రివార్డు, ఎల్ఓఎస్​ సభ్యులు డాబ్రా గంగ, సోడె రాజే, మాడవి బుదరీలపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు.  లొంగిపోయిన మావోయిస్టులకు చత్తీస్​గఢ్​ ప్రభుత్వం పునరావాస పథకం కింద పరిహారం, ఉపాధి కల్పిస్తామని బస్తర్​ఐజీ సుందర్​రాజ్​తెలిపారు. ఎస్పీ కిరణ్​చౌహాన్​ ఉన్నారు.