జీపీ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు టాప్ : ఎమ్మెల్యే రోహిత్రావు

జీపీ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు టాప్ : ఎమ్మెల్యే రోహిత్రావు
  •     ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎమ్మెల్యే  రోహిత్ రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 70 శాతానికిపైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, కార్యకర్తల కష్టంతో అద్భుత ఫలితాలు సాధించమన్నారు. పల్లెజనం ఇచ్చిన తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. 

స్థానిక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పని అయిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ కు ఇప్పటికే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ మనుగడే కరువవుతుందని విమర్శించారు.