పెబ్బేరు, వెలుగు: ప్రణాళికతో చదివితే టెన్త్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని వనపర్తి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రజని పేర్కొన్నారు. బుధవారం మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ గర్ల్స్ స్కూల్లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గృహహింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో, మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రదర్శించిన నాటిక ఆలోచింపజేసింది. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్15100 ను సంప్రదించాలని జడ్జి సూచించారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ జయచంద్ర, ఎంజేపీ ప్రిన్సిపాల్ కవిత, లెక్చరర్లు, టీచర్లు పాల్గొన్నారు.
