మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబమంతా అన్నిరంగాల్లో ముందుంటుందని, చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో స్థాపించిన మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉచిత శిక్షణ పొందుతున్న మహిళా సంఘాల సభ్యులకు బుధవారం నగరంలోని మెప్మా ఆఫీస్లో ఎమ్మెల్యే కోర్సుకు సంబంధించిన మెటీరియల్ను ఫ్రీగా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో మహిళా సంఘాల సభ్యుల ఖాతా వివరాలు, లోన్ వివరాలు, తదితర అన్ని అంశాలు కంప్యూటర్ లో నమోదు చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కొత్తగా ఎన్నికైన ఇండిపెండెంట్ సర్పంచులుఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ప్రపంచ పెన్షనర్స్ డే సందర్భంగా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
గండీడ్ మండలానికి చెందిన అనాథ పిల్లల సంరక్షణ కోసం రిటైర్డ్ తహసీల్దార్ ఎస్.చంద్రశేఖర్ రూ.50 వేలు ఎమ్మెల్యే సమక్షంలో చిన్నారులకు అందించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రిటైర్డ్ ఉద్యోగులు ఎం.సాయిలు గౌడ్, బి.ప్రభాకర్, ఎ.ప్రభాకరాచారి పాల్గొన్నారు.
