మీరు మారరా : తిరుమల ఆలయం ఎదుట రాజకీయ పోస్టర్ విడుదల

మీరు మారరా : తిరుమల ఆలయం ఎదుట రాజకీయ పోస్టర్ విడుదల

ఎన్ని సార్లు చెప్పినా వినరు.. మారరు.. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయాలకు.. అన్యమత ప్రచారం చేయటం నేరం.. నిషేధం. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఫొటోలు తప్పితే మిగతా ఎలాంటి పోస్టర్లు ఆవిష్కరించకూడదు.. ప్రదర్శించకూడదు. అయినా కొంత మంది పిచ్చి పిచ్చిగా రీల్స్ చేయటం.. బ్యానర్లు ప్రదర్శించటం.. పోస్టర్లు అంటించటం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు మళ్లీ ఒకటి వెలుగులోకి వచ్చింది. 

తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి దర్శనం కోసం కొండకు వచ్చారు. శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకులతో ఉన్న ఫొటోలు, బ్యానర్లను ప్రదర్శించారు. ఆ తమిళనాడు భక్తులు.. ఫ్లెక్సీ బ్యానర్ ఆవిష్కరిస్తున్నట్లు ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో పెట్టారు. 

ALSO READ : శ్రీశైలం మహా క్షేత్రంలో యువతి వింత చేష్టలు..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన కీలక నేతతోపాటు వేంకటేశ్వరస్వామి ఉన్న ఫొటోలతో ఈ ఫ్లెక్సీ బ్యానర్లు ఉన్నాయి. కొండపై వేంకటేశ్వరస్వామి గోపురం ఎదుట నిల్చొని.. ఆ తమిళనాడు భక్తులు ఇలా ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శించటంపై.. తిరుమల తిరుపతి దేవస్తానం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలంటూ స్పష్టం చేశారు.