శ్రీశైలం మహా క్షేత్రంలో యువతి వింత చేష్టలు..సోషల్ మీడియాలో వైరల్..ఆగ్రహించిన భక్తులు

శ్రీశైలం మహా క్షేత్రంలో యువతి వింత చేష్టలు..సోషల్  మీడియాలో వైరల్..ఆగ్రహించిన భక్తులు

శ్రీశైలం వంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కొందరు యువతీ యువకులు ప్రవర్తిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తిభావంతో గడపాల్సిన చోట, సోషల్ మీడియా పిచ్చితో నిబంధనలను అతిక్రమిస్తూ చేస్తున్న వికృత చేష్టలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. శ్రీశైల క్షేత్రంలో నడిరోడ్డుపై ఓ యువతి సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ, వింత చేష్టలతో ఇన్ స్టా రీల్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ,నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రం నడిరోడ్డుపై సినిమా  సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసి nithya_cute_baby అనే ఇన్ స్టా అకౌంట్ లో  ఈ వీడియో వైరల్ పోస్ట్ చేసింది ఓ యువతి. ఈ వీడియోలో  శారీ కట్లులో యువతి శ్రీశైలం వీధుల్లో నడిరోడ్డుపై మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంది.. పక్కనుంచి ఆటోలు, కార్లు, బైకులు వెళ్తున్నా పట్టించుకోకుండా రీల్స్ పిచ్చిలో మునిగిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో అటు నెటిజన్లు, ఇటు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రంలో యువత అత్యుత్సాహంతో ప్రదర్శిస్తున్నారు... ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి వింత చేష్టలతో ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు.. శ్రీశైలంలో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రీల్స్ వైరల్ కావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అధికారుల పర్యవేక్షన కొరవడిందంటూ భక్తులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రీల్స్ చేస్తు్న్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.