గ్రామాభివృద్ధిపై దృష్టిపెట్టాలి : ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

గ్రామాభివృద్ధిపై దృష్టిపెట్టాలి : ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు
  •     ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు 

ఝరాసంగం, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సూచించారు. మండలంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్​ప్రభుత్వమేనని ఇందుకు నిదర్శనం పంచాయతీ ఎన్నికలే అన్నారు. 33 పంచాయతీలకు 15 పంచాయతీలు బీఆర్ఎస్ గెలవడం సంతోషకరమన్నారు. 

ఝరాసంగం పంచాయతీ ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్,  వార్డు సభ్యులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ రాయికోటి వినోద, ఉప సర్పంచ్ గడ్డం మమత, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్వర్, మాజీ ఎంపీపీ సంగీత సంగమేశ్వర్, మాజీ ఎంపీటీసీ రజిని ప్రియా సంతోష్ పాటిల్, నాయకులు ఏజాజ్ బాబా, శ్రీనివాస్ పటేల్, నాగన్న పటేల్, నాగన్న సజ్జన్ శెట్టి, ఉల్లాస్, సామెల్, సద్దాం, కేదార్ చౌతాయి పాల్గొన్నారు.