అమెజాన్‌‌‌‌లో రోబోలతో పని.. 5 లక్షల మంది ఇంటికే !

అమెజాన్‌‌‌‌లో రోబోలతో పని.. 5 లక్షల మంది ఇంటికే !
  •  అమెరికాలో వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ల రూపురేఖలు మారుస్తామని కంపెనీ ప్రకటన


న్యూఢిల్లీ: అమెజాన్‌‌‌‌ అమెరికాలో తన వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ల నిర్వహణలో భారీ మార్పుకు సిద్ధమవుతోంది. రానున్న పదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలను రోబోట్లతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అమెజాన్‌‌‌‌ వద్ద 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్నా,  కొత్త ఉద్యోగులను నియమించకుండా ఉండేందుకు ఆటోమేషన్ వైపు కంపెనీ చూస్తోంది. 

 ష్రెవెపోర్ట్‌‌‌‌ (లుసియానా) వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లో ఇప్పటికే  వెయ్యి రోబోలు పనిచేస్తున్నాయి. ఈ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ 25శాతం తక్కువ ఉద్యోగులతో పని చేయగలుగుతోంది.  2027 నాటికి 40 వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లలో ఇదే మోడల్‌‌‌‌ను అమలు చేయాలని అమెజాన్‌‌‌‌ ప్లాన్ చేస్తోంది.  అయితే  ఉద్యోగులను పూర్తిగా రోబోలతో భర్తీ  చేయమని చెబుతోంది.  ష్రెవెపోర్ట్‌‌‌‌లో 160 మంది రోబోటిక్ టెక్నీషియన్లు గంటకు 24.45 డాలర్ల వేతనంతో పనిచేస్తున్నారని పేర్కొంది. 

అదే  ఇతర ఉద్యోగులు గంటకు 19.50 డాలర్లు పొందుతున్నారంది. ఇంకా మెకానిక్స్‌‌‌‌కు  శిక్షణ  ఇస్తున్నామని కంపెనీ వివరించింది. అయితే, ఈ మార్పు బ్లూ-కాలర్ ఉద్యోగులు, ముఖ్యంగా బ్లాక్‌‌‌‌ కమ్యూనిటీలపై ప్రభావం చూపొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెజాన్‌‌‌‌ ఉద్యోగాల తగ్గింపును ప్రకటించకపోయినా, ఆటోమేషన్ వల్ల కొన్నిచోట్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది.