హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణపై సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఒక రోజు వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సెక్రటరీలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అధికారులను ఈ వర్క్‌షాప్‌కు ఆహ్వానించారు. ఇందులో పాల్గొనేందుకు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ వి.నర్సింహాచార్యులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉపేందర్ రెడ్డి, ప్రసన్నకుమారి, అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్, డిప్యూటీ సీఈవో సత్యవేణి, సీఈవో ఎస్‌వో రవిచంద్ ఢిల్లీకి చేరుకున్నారు.
