ఇండియాలో డోపింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువే

ఇండియాలో డోపింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువే

న్యూఢిల్లీ: డోపింగ్‌‌‌‌‌‌‌‌ పరీక్షల్లో ఇండియా అత్యధిక ప్రతికూల ఫలితాలను నమోదు చేస్తోందని వరల్డ్‌‌‌‌‌‌‌‌ యాంటీ డోపింగ్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (వాడా) వెల్లడించింది. రెండు వేలు లేదా అంతకంటే ఎక్కువ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసినప్పుడు ఎక్కువ నిషేధిత ఉత్ప్రేరకాలు ఇండియన్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్ల నుంచే బయటపడుతున్నాయని వెల్లడించింది. నిర్ణీత కాల వ్యవధిలో 3865 శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ (బ్లడ్‌‌‌‌‌‌‌‌, యూరిన్‌‌‌‌‌‌‌‌)ను పరీక్షించినప్పుడు 125 రకాల నిషేధిత ఉత్ప్రేరకాలు బహిర్గతమయ్యాయని తెలిపింది. 

మొత్తం శాంపిల్స్‌‌‌‌‌‌‌‌లో ఇది 3.2 శాతంగా ఉంది. సౌతాఫ్రికా (2033 శాంప్సిల్‌‌‌‌‌‌‌‌) 2.9 శాతంతో, కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌ (2174) 1.9 శాతంతో వరుసగా రెండు, మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, అమెరికా (6782), నార్వే (2075) నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. చైనాకు చెందిన 19,228 శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయగా 0.2 శాతం నిషేధిత ఉత్ప్రేరకాలు మాత్రమే బయటపడ్డాయి. 13,653 జర్మనీ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను పరీక్షించగా 0.3 శాతం, రష్యా (10,186) 0.8 శాతంగా నమోదు చేశాయి.