బ్యాంకాక్ (థాయ్‌లాండ్): వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో ఇండియా స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి రెండు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో ఇండియా కాంపౌండ్ టీమ్స్ మొత్తం మూడు స్వర్ణ పతకాలను కొల్లగొట్టాయి. శుక్రవారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లో శీతల్ దేవి– పాయల్ నాగ్ జంట 150–-147 తో కజకిస్తాన్‌పై విజయం సాధించింది.
ఆపై మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో శీతల్–తోమన్ కుమార్ ద్వయం 153-–146 తో ఇండోనేసియా జంటపై గెలిచింది. మెన్స్ టీమ్ ఈవెంట్ ఫైన్లో తోమన్–శ్యామ్ సుందర్ స్వామి జోడీ 153–-146 తేడాతో చైనీస్ తైపీని ఓడించి ఇండియాకు మూడో గోల్డ్ అందించింది.
