WAC 2023: ఒలంపిక్స్ రేసు మొదలైంది..: ఫైనల్‌లో మన నీరవ్ చోప్రా

WAC 2023: ఒలంపిక్స్ రేసు మొదలైంది..: ఫైనల్‌లో మన నీరవ్ చోప్రా

భారత ఏస్ జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో రికార్డు బద్దలు కొట్టాడు. బుడాపెస్ట్‌లో వేదికగా జరుగుతోన్న వరల్డ్ అథ్లెటిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల త్రోను నమోదు చేశాడు. తద్వారా ఫైనల్స్‌లోకి ప్రవేశించడమే కాకుండా, 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023లో బంగారు పతకం కోసం భారత నిరీక్షణ కొనసాగుతోంది. ఈ టోర్నీ చరిత్రలో రజత పతకాన్ని గెలిచిన ఏకైక భారత అథ్లెట్ నీరజ్ మాత్రమే. ఇప్పుడు బంగారు పతకాన్ని అందుకునే అవకాశం అతని ముందు ఉంది. ఇటీవలే గాయం నుండి కోలుకున్న నీరజ్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. రనప్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకపోగా తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల త్రో విసిరి ఔరా అనింపించాడు.

కాగా, నీరజ్‌తో పాటు జూలియన్ వెబర్(జర్మనీ), డేవిడ్ వెంగర్(పోలాండ్‌),డిపి మను(భారత్‌).. మాత్రమే 80 మీటర్ల మార్కును చేరుకున్నారు. వెబెర్ తన రెండో ప్రయత్నంలో 82.39 మీటర్ల త్రోను నమోదు చేయగా, మను తన మూడో ప్రయత్నంలో 81.31 మీటర్ల త్రో విసిరి గ్రూప్ ఏ నుండి మూడో స్థానంలో నిలిచాడు. 

WAC 2023 గ్రూప్ A ఫైనల్ స్టాండింగ్స్

  • నీరజ్ చోప్రా - 88.77మీ (ప్ర)
  • జూలియన్ వెబర్ (GER) - 82.39
  • DP మను (IND) - 81.31
  • డేవిడ్ వెగ్నర్ (POL) - 81.25
  • టోని కుసేలా (FIN) - 79.27మీ
  • రోడ్రిక్ డీన్ (JPN) - 78.57
  • అండర్సన్ పీటర్స్ (GRN) - 78.49
  • పాట్రిక్స్ గైలమ్స్ (LAT) - 77.43
  • కెంజి ఒగురా (JPN) - 76.65
  • కేపర్స్ విలియమ్సన్ (USA) - 76.10
  • డౌ స్మిట్ (RSA) - 75.03
  • ఫెలిస్ సోసైయా (FRA) - 74.80
  • కర్టిస్ థాంప్సన్ (USA) - 74.21
  • లియాండ్రో రామోస్ (POR) - 74.03
  • గాటిస్ కాక్స్ (LAT) - 73.42
  • పెడ్రో రోడ్రిగ్స్ (BRA) - 72.34