
ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలిచివేసింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన రైలు ప్రమాదం మరొకటి ఉంది. ఈ రైలు ప్రమాదం 26 డిసెంబర్ 2004న, శ్రీలంకలో సముద్రాదేవి అనే రైలుకు ప్రమాదం జరిగింది. అప్పుడు ఈ ప్రమాదంలో 1700 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం మన దేశంలో రెండో అతిపెద్ద రైలు ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ( వార్త రాసే వరకు) 288 మంది మరణించారు. భారతదేశంలో అతిపెద్ద రైలు ప్రమాదం 1981లో బీహార్‌లో జరిగింది. అప్పుడు రైలు నదిలో పడిపోయిన ఘటనలో 800 మంది మరణించారు.
సముద్రాదేవి రైలు
శ్రీలంకలో (2004 శ్రీలంక సునామీ రైలు ప్రమాదం) 2004 డిసెంబర్ 26 న జరిగిన రైలు ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం. ఈ ప్రమాదంలో దాదాపు 1700 మంది మరణించారు. సముద్రాదేవి (సముద్రం యొక్క రాణి) అనే ఈ రైలు కొలంబో నగరం నుండి గాలే నగరానికి వెళుతోంది. కొలంబో ఫోర్ట్ స్టేషన్ లో (2004 డిసెంబర్ 26) రైలు ఉదయం 6.30 గంటలకు 1500 మంది ప్రయాణీకులు (టికెట్లు కలిగి ఉన్నవారు)ఇంకా మరికొంత మంది టికెట్ లేకుండా.. ట్రైన్ పాస్ హోల్టర్లు ఈ రైలులో ఎక్కారు. ఈ రైలు సముద్రానికి 200 మీటర్ల దూరంలోని శ్రీలంక నైరుతి తీరానికి సమీపంలో ఉన్న తెల్వాట్ట గుండా వెళ్ళింది.
సునామీలో కొట్టుకుపోయిన రైలు
తెల్వత్తా సమీపంలోని పెరలియా గ్రామానికి రైలు ఉదయం 9.30 గంటలకు (2004 డిసెంబర్ 26) చేరుకుంది. ఆ సమయంలో భూకంపం సునామీకి అలలు రైలును తాకాయి. ఆ సమయంలో రైలులోకి నీరు వచ్చింది . ట్రైనంతా నీరు నిండిపోవడంతో ప్రయాణికులు భయంతో రైలు పైకి ఎక్కారు. కొంతమంది అలల నుంచి తప్పించుకునేందుకు మంది రైలు వెనుకే నిలబడ్డారు. ఆ తరువాత 10 నిమిషాల తర్వాత రెండోసారి ఉధృతంగా అలలు రావడంలో రైలు కొట్టుకుపోయింది. సముద్రాదేవి రైలు ఇళ్లు, చెట్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1700 మంది మరణించారని అధికారికంగా ప్రకటించారు. కాని మృతుల సంఖ్య 2వేలకు పైగా ఉంటుందని అప్పట్లో శ్రీలంక మీడియా సంస్థలు వెల్లడించాయి. కాని సముద్రంలో కొట్టుకుపోయిన వారి 900 మృత దేహాలను వెలికితీయగా.. 150 మందిని రక్షించారు.