ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచిన విషయం తెలిసిందే. సింగ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్లో హోరాహోరీగా తలపడి డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి విశ్వ విజేతగా అవతరించాడు. ఈ చిరస్మరణీయ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. టైటిల్‌తో పాటు
13.6 కోట్ల భారీ ప్రైజ్ మనీ సైతం గుకేష్ గెల్చుకున్నాడు. 18 ఏళ్ల వయసులోనే చెస్ ప్రపంచ విజేతగా నిలిచి దేశ కీర్తి ప్రతిష్టను పెంచిన గుకేష్‌కు కేంద్ర ప్రభుత్వం భారత్ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న ప్రకటించింది. ఇదిలా ఉంటే.. Chess.com గుకేష్‌కు సంబంధించి ఒక ఆసక్తికర నివేదిక వెల్లడించింది. చెప్ వరల్డ్ చాంఫియన్‌గా నిలిచి గుకేష్ అందుకున్న ప్రైజ్ మనీ.. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది.
ALSO READ | తెలంగాణలో టీఎంటీ బార్లను విస్తరిస్తాం..కామధేను లిమిటెడ్ ప్రకటన
గుకేష్ రూ.13.6 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా.. విశ్వవిజేతగా నిలిచిన 18 ఏళ్ల కుర్రాడికి తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల నగదు బహుమతి ఇచ్చింది. ఈ రూ.5 కోట్లు కాకుండానే గుకేష్ గెల్చుకున్న రూ.13.6 కోట్ల ప్రైజ్ మనీ.. యూఎస్ ప్రెసిడెంట్ వార్షిక వేతనానికి రెండు రెట్లు ఎక్కువని Chess.com పేర్కొంది. అమెరికా అధ్యక్షుడికి వార్షికంగా 4 లక్షల డాలర్ల వేతనం అందుతుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ.3.3 కోట్లు. వేతనంతో పాటు 50 వేల డాలర్లు పన్ను రహిత వేతనం, దీంతో పాటు ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్ల జీతం అందుకుంటారు. ఈ మొత్తాలన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి లభించేది 5.69 లక్షల డాలర్ల వరకు ఉంటుంది.