ర్యాపిడ్‌ లో హంపి, హారికకు చుక్కెదురు

ర్యాపిడ్‌ లో హంపి, హారికకు చుక్కెదురు

పెంగ్‌ షుయె (చైనా ): వరల్డ్‌ మాస్టర్స్‌ మహిళల చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో తెలుగు గ్రాండ్‌ మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి ర్యాపిడ్‌ విభాగంలో తీవ్రంగా నిరాశ పరిచారు. పేరుకు తగ్గట్టు ఆడలేకపోయిన ఈ ఇద్దరు అట్టడుగున నిలిచిపోయారు.16 మంది పోటీ పడ్డ  ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో హారిక 4.5పాయిం ట్లతో 14వ స్థా నం, హంపి 4 పాయిం ట్లతో15వ స్థానంతో సరిపెట్టింది . గురువారం జరిగిన చివరి మూడు (9 నుంచి 11 రౌండ్లు ) గేమ్‌ లను డ్రా చేసుకున్న  హంపి 1.5 పాయింట్లు మాత్రమే రాబట్టింది . తొమ్మిదో రౌండ్‌ లో ఓడిన హారిక పదోరౌండ్‌ లో హంపితో, 11వ రౌండ్‌ లో జవొ జుయెతో పాయింట్లు పంచుకుంది . కాగా, పురుషుల ర్యాపిడ్‌ విభాగంలో ఇండియా ప్లేయర్‌ విదిత్‌ సంతోష్‌ 6 పాయిం ట్లతో ఆరో స్థానం సాధించాడు. ఈ టోర్నీలో బ్లిడ్జ్‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్ర, శనివారాల్లో జరుగుతుంది .