డిగ్రీ పూర్తి చేసేందుకు ఐదు దశాబ్దాల టైం  తీసుకున్న విద్యార్థి

డిగ్రీ పూర్తి చేసేందుకు ఐదు దశాబ్దాల టైం  తీసుకున్న విద్యార్థి

సాధారణంగా మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేస్తారు. కొంతమంది నాలుగైదేళ్లకు గానీ డిగ్రీ పూర్తిచేయరు. అంతకంటే, ఎక్కువ ఏళ్లు డిగ్రీ చేసినోళ్లు కూడా ఉన్నారు. కాని  కొలంబియాకు చెందిన ఓ విద్యార్థి ఆర్దర్ రాస్  మాత్రం ఈ విషయంలో రికార్డ్ సృష్టించాడు. ఏకంగా 54 ఏళ్ల విరామం తర్వాత డిగ్రీ పూర్తిచేశారు.  ఆ కథేంటో మీరూ చదవండి..

డిగ్రీకి ఐదు దశాబ్దాల కాలం

కొలంబియాకు చెందిన ఓ విద్యార్థి మాత్రం ఐదు దశాబ్దాల కాలం తీసుకున్నాడు. అతని పేరు రాస్‌. ఇప్పుడు అతని వయసు 71 ఏళ్లు. ఈ వయసులో ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా (యుబిసి)లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. రాస్‌ డిగ్రీ పూర్తి చేయడానికి దాదాపు 54 ఏళ్ల కాలం పట్టిందని  బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం(UBC) వెల్లడించింది. అలాగే రాస్‌ని 'వరల్డ్‌ స్లోయెస్ట్‌ స్టూడెంట్‌'గా కూడా ఆ యూనివర్సిటీ అభివర్ణించింది. 

నటనపై దృష్టి

ఆర్దర్ రాస్   1969లో  బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం(UBC) లో చేరాడు. కానీ అప్పుడు నేను చదువుపై దృష్టి పెట్టలేదు. అప్పుడు అతడు తన   దృష్టి అంతా నటనపైనే ఉందని తెలిపాడు. తాను నటుడినవ్వాలని అనుకున్నాను. ఆ సమయంలోనే థియేటర్స్‌  విపరీతంగా ఆకర్షించాయని తెలిపాడు . థియేటర్‌లలో సినిమా చూస్తూ... మూవీలోని నటుల నటనను, సన్నివేశాలను అన్నీ పరిశీలించేవాడినని . నటన అనేది నాకు ఓ పవర్‌లా అనిపించిందన్నాడు వరల్డ్‌ స్లోయెస్ట్‌ స్టూడెంట్‌ ఆర్దర్ రాస్. ఆ తర్వాత నేను నటుడినయ్యాను. ప్రఖ్యాత కెనడియన్‌ నటులైన నికోలా కావెండిష్‌, లారీ లిల్లో, బ్రెంట్‌ కార్వర్‌ వంటి నటులతో కలిసి నటించాను. నేను మంచి నటుడినని నాకు తెలుసు. కానీ నేనెప్పుడూ నేను నాకంటే కూడా ఎదుటివారు గొప్పగా ఉండాలని కోరుకుంటాను.' అని ఆయన అన్నారు.

చదువుపై నిర్లక్ష్యం

రాస్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. చదువును నిర్లక్ష్యం చేశాననే భావన అతనిని ఎప్పుడూ వెంటాడేదట. దీంతో అతను యుబిసిలోబ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం(UBC)   డిగ్రీని పూర్తి చేయాలని అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే తాను యుబిసిలో డిగ్రీ పూర్తి చేశాడు. యుబిసి డిగ్రీ కంటే ముందు టోరంటోలోని లా స్కూల్‌కి వెళ్లి గ్రాడ్యుయేట్‌ అయ్యాడు. 2016 నవంబర్‌లో బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం(UBC) కు సమాచారం  ఇచ్చాడు.  65 ఏళ్ల వయసులో డిగ్రీ స్టూడెంట్ గా 2017లో యుబిసిలో పార్ట్‌టైమ్‌ స్టూడెంట్‌గా రాస్‌ జాయిన్‌ అయ్యారు. తనకు చరిత్ర సబ్జెక్టు అంటే ఇష్టమట. చరిత్రలో కూడా మొదటి ప్రపంచ యుద్దం పాఠ్యాంశాన్ని పలుమార్లు ఆసక్తిగా చదివినట్లు రాస్‌ అన్నారు. ఇలా ఆర్థర్ రాస్ తన యూనివర్సిటీ డిగ్రీని ప్రారంభించిన ఐదు దశాబ్దాల తరువాత పూర్తి చేసి  2023 మే 25న  యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (UBC) నుంచి  తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశాడు.